‘డ్రాగన్’ అవతారంలో అలరించడానికి టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ (Jr NTR) సర్వసన్నద్ధమవుతున్నారు. కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, ఎన్టీఆర్ 'లూగర్' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.
కొద్ది రోజుల క్రితం తారక్‌కు గాయం కావడంతో షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, సినిమా చిత్రీకరణ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా శరవేగంగా కొనసాగింది. తాజాగా ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని మళ్లీ సెట్లోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణంపై ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్, బిజూ మేనన్, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also read - సూపర్ ఎల్‌నినో’ ముప్పుపై విజయ్ దేవరకొండ హెచ్చరిక.. నీరు, ఆహారం, విద్యుత్ వృథా చేయొద్దు!
